నేచురల్ స్టార్ నాని ఇప్పటికే ‘సరిపోదా శనివారం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను ముగించుకుని, ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా, అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత నాని తన హోం బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా లో ‘హిట్-3’ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.
ఇప్పటికే హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఇప్పుడు ‘హిట్-3’ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమా కోసం నాని కేవలం హీరోగానే కాకుండా మరో అవతారం కూడా ఎత్తాడట. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ను నాని స్వయంగా రాసుకున్నాడట.
దర్శకుడు శైలేష్ కొలనుకు తన స్టోరీలైన్ వినిపించి పూర్తి కథను సిద్ధం చేయమని నాని చెప్పాడట. ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉండటంతో చిత్ర షూటింగ్ ను సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ వార్తతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నాని ‘అర్జున్ సర్కార్’ అనే పవర్ఫుల్ కాప్ పాత్రలో కనిపించనున్నాడు.