పిక్ టాక్: చిన్నారులతో కలిసి 2025 కి స్వాగతం పలికిన నాని

పిక్ టాక్: చిన్నారులతో కలిసి 2025 కి స్వాగతం పలికిన నాని

Published on Jan 2, 2025 2:01 AM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2025 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. వివిధ దేశాల్లో తమదైన పద్ధతిలో ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కుర్రకారు ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. సెలబ్రిటీలు మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరూ 2025 న్యూ ఇయర్ వేడుకను గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఇక టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అయితే, న్యాచురల్ స్టార్ నాని కూడా 2025 ని తనదైన విధంగా స్వాగతం పలికారు. చిన్నారులతో కలిసి నాని ఈ నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. చిన్నారులతో ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం సంతోషంగా ఉందని నాని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో నాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే నాని ప్రస్తుతం ‘హిట్-3’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు