న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో మూడో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అర్జు్న్ సర్కార్ అనే పవర్ఫుల్ కాప్ పాత్రలో నాని తనలోని మాస్‌ను చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్లో జరుగుతోంది. చివరి షెడ్యూల్లో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇక నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ.. హ్యాపీ X ‘మాస్’ అంటూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మంచులో గుర్రంతో కలిసి నాని ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.
శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంత్ త్రిపిర్నేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.