డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన నాని “అంటే సుందరానికి”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన నాని “అంటే సుందరానికి”

Published on Jul 3, 2022 5:39 PM IST


నేచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి అయిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా ట్విట్టర్‌ ద్వారా స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం జూలై 10 నుండి తెలుగు, మలయాళం మరియు తమిళ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. నజ్రియా ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు