నాని సినిమాలో కామెడీ జనరేట్ అయ్యేది ఇలాగేనట !

Published on Nov 25, 2020 12:32 am IST

నాచ్యురల్ స్టార్ నాని సైన్ చేసిన కొత్త చిత్రం ‘అంటే.. సుందరానికీ !’. ఇటీవలే టైటిల్ పోస్టర్ రిలీవ్ చేశారు. అందులో నాని పంచె కట్టుతో కొత్తగా కనిపించారు. టైటిల్, ఫస్ట్ లుజ్ పోస్టర్ తోనే సినిమా పక్కా కామెడీ ఎంటెర్టైనర్ అని చెప్పేశారు టీమ్. ఇక సినిమాలో ఆ కామెడీ ఏ పాయింట్ మీద నడుస్తుంది అంటే రెండు కుటుంబాల మధ్యట. ఇందులో నాని పర్ఫెక్ట్ బ్రాహ్మణ పాత్రలో కనిపిస్తారట. అలాగే హీరోయిన్ నజ్రియ క్రిస్టియన్ అమ్మాయిగా కనిపిస్తుందట. ఇలా వేరే వేరే మతాలకు చెందిన హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి పడిన పాట్లే సినిమా లైన్.

అయితే ఈ ఇబ్బందులు, కష్టాలు సీరియస్ తరహాలో ఉండవు. అన్నీ లైటర్ వేలో నవ్వులు పూయించేలా ఉంటాయట. హీరోయిన్ కుటుంబం కూడ బ్రాహ్మణ కుటుంబమే అంటూ అబద్దమాడి వారిని తన ఇంట్లోకి ప్రవేశపెట్టిన హీరో తన కుటుంబం ముందు మేనేజ్ చేయడానికి కిందా మీదా పడిపోవడమే ఇందులో అసలు సిసలు ఎంటెర్టైన్మెంట్ అంటున్నారు. నాని గతంలో పలు ఎంటర్టైనర్లు చేసినా ఈ తరహా కథాంశంతో చేయడం ఇదే మొదటిసారి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా షూట్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More