3 రోజుల్లో 52 కోట్లతో “సరిపోదా శనివారం”

3 రోజుల్లో 52 కోట్లతో “సరిపోదా శనివారం”

Published on Sep 1, 2024 6:20 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 52.18 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాల తర్వాత మరోసారి నాని 50 కోట్ల క్లబ్ లో చేరడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, విషెస్ తెలుపుతున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు