నాని “సరిపోదా శనివారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

నాని “సరిపోదా శనివారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

Published on Aug 22, 2024 5:08 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. అంటే సుందరానికి చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని హీరో నాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ ఆగస్టు 24 వ తేదీన హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, నొవోటల్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విలక్షణ నటుడు ఎస్. జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు