నాని “సరిపోదా శనివారం” నుండి రేపు సెకండ్ లుక్ రిలీజ్!

నాని “సరిపోదా శనివారం” నుండి రేపు సెకండ్ లుక్ రిలీజ్!

Published on Jul 3, 2024 10:01 PM IST

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకుంది. వారి రెండవ చిత్రం సరిపోదా శనివారం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంకి సంబందించిన సెకండ్ లుక్ పై మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. సెకండ్ లుక్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే సూర్య శనివారం రోజు ఎలా ఉంటాడో మీరు చూశారు. మిగతా రోజుల్లో ఎలా ఉంటాడో రేపు చూడనున్నారు అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ 29, 2024న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు