సరిపోదా శనివారం చిత్రంతో నాని యూఎస్ ప్రాంతంలో మరో వన్ మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టడం ఖాయం అని తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రేపు యూఎస్ ప్రాంతంలో మొదలు కానుంది. ప్రీ సేల్స్ ఈ ప్రాంతంలో జోరు అందుకున్నాయి. ఇప్పటి వరకూ 250కే డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. రేపటికి ఈ వసూళ్లు మరింత పెరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, చాలా ప్రాంతాల్లో ఫాస్ట్ గా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించాడు. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం డే 1 వసూళ్లు మాత్రం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.