2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి నాని “సరిపోదా శనివారం”

2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి నాని “సరిపోదా శనివారం”

Published on Sep 2, 2024 11:51 PM IST


నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో తాజాగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా సరిపోదా శనివారం చిత్రం నిలిచింది.

హీరో నాని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హిట్స్ సాధించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు