నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ మూవీ సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. నార్త్ అమెరికాలో కూడా తన సత్తా చాటుతున్నాడు హీరో నాని. ఈ చిత్రం ఇప్పటి వరకూ 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. నేడు ఆదివారం కావడంతో వసూళ్లు మరింత భారీగా ఉండే అవకాశం ఉంది.
నాని సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును కనబరిస్తే, త్వరలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ప్రియాంక మోహన్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు.