ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న చిత్రాల్లో మంచి అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సరిపోదా శనివారం” కూడా ఒకటి. ఒక మాస్ హిట్ అలాగే క్లాస్ హిట్స్ తర్వాత వస్తున్నా సినిమా ఇది కావడంతో ఇది హ్యాట్రిక్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రిలీజ్ ని మేకర్స్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 29కి ఫిక్స్ చేయగా ఈ డేట్ లో ఎలాంటి పోటీ లేకపోయేసరికి ఈ ఛాన్స్ ని మేకర్స్ తీసుకొని నాని కెరీర్లోనే బిగెస్ట్ రిలీజ్ గా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమాపై ఎలానో సాలిడ్ హైప్ ఉంది. ఇలా తన హైయెస్ట్ డే 1 ని ఈ చిత్రంతో నాని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.