యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నేను హైదరాబాద్ లోని శిల్పకళవేదికలో గ్రాండ్ గా జరగనుంది. దీంతో గత రెండు రోజులుగా అభిమానులు ఈ ఆడియో కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనే విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అదలా ఉంచితే ఈ సినిమా పుల్ ఆడియో సాంగ్స్ అప్పుడే నెట్లో రిలీజ్ అయిపోయాయి.
దాంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఆడియోని డౌన్ లోడ్ చేస్కొని వినడం మొదలు పెట్టేసారు. ఇకపోతే నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ మరియ్యు ఆడియో సాంగ్స్ మీద వస్తున్న రెస్పాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ రోజు సాయంత్రం దేవీశ్రీ లైవ్ పెర్ఫార్మన్స్ తో స్టేజ్ పై ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే ఆడియో లాంచ్ కి సంబందించిన కార్యక్రమాలను పూర్తి చేసారు. ఎన్.టి.ఆర్ సరస్నా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.


