త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సోలో’ విజయం పై హీరో నారా రోహిత్ పూర్తి విశ్వాసం తో ఉన్నారు. 2009 లో తన తొలి చిత్రం ‘బాణం’ తో తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెరంగేట్రం చేసిన రెండేళ్ళ అనంతరం రోహిత్ మరో చిత్రం లోనటించారు. ఈ దఫా ఆయన ‘సోలో – సోలిడ్ లవ్ స్టొరీ’ తో ముందుకొస్తున్నారు. మూవీ కి సంబంధించి ఆయన ఓ ప్రముఖ దిన పత్రికతో మాట్లాడారు. గౌతం మీనన్, శ్రీను వైట్ల చిత్రాల్లో నటించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వాళ్ళ అవి వర్క్అవుట్ కాలేదన్నారు.
సుమారు 100 కథలు విన్న అనంతరం పరశురాం ‘సోలో’ చిత్రానికి ఓకే చెప్పానని నారా రోహిత్ వెల్లడించారు. ఈ సినిమాలో నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురాం డైరెక్టర్.
కాగా ఈ చిత్రం పై సినీ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. ఎస్వికె బ్యానర్ పై వంశీ కృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకురానుంది.