సుందరకాండ టీజర్.. కామెడీతో ఆకట్టుకుంటున్న నారా రోహిత్

సుందరకాండ టీజర్.. కామెడీతో ఆకట్టుకుంటున్న నారా రోహిత్

Published on Aug 26, 2024 1:00 PM IST

టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న చిత్రాలను సెలెక్ట్ చేసే హీరోగా నారా రోహిత్‌కి మంచి పేరుంది. ఇక ఈసారి ఓ కంప్లీట్ మేకోవర్‌తో కామెడీ ఎంటర్‌టైనర్ కథను మనముందుకు తీసుకొస్తున్నాడు. ‘సుందరకాండ’ అనే సినిమాలో నారా రోహిత్ నటిస్తుండగా, ఈ చిత్ర టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఓ ఐదు లక్షణాలు ఉండాలని కోరే అబ్బాయి పాత్రలో నారా రోహిత్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ క్రమంలో అతడికి ఏ అమ్మాయి సెట్ కాకపోవడం.. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన పడటం వంటి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మరి నారా రోహిత్ అనుకున్న ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయి అతడికి దొరుకుతుందా లేదా అనేది సినిమాలో చూడాల్సిందే.

ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, వీర్తి వాఘాని, నరేష్, వాసుకి ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తుండగా.. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు