నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.. వధువు ఎవరంటే?

నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.. వధువు ఎవరంటే?

Published on Oct 10, 2024 4:00 PM IST

టాలీవుడ్‌లో విలక్షణమైన సినిమాలు చేసే హీరోగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో గతకొన్నేళ్లుగా మంచి సినిమాలు చేస్తూ హిట్-ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇక రీసెంట్‌గా ‘ప్రతినిథి-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్, ఇప్పుడు ‘సుందరకాండ’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే, ఈ హీరోకి ఇప్పుడు తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 40 ఏళ్లకు నారా రోహిత్ ఓ ఇంటివాడు కానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా రోహిత్ నిశ్చితార్థ వేడుక ఈ నెల 13న జరగనుందని తెలుస్తోంది. అయితే, నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

కానీ, నారా రోహిత గతకొద్ది రోజులుగా ఓ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాడని.. ఆయన నటించిన ‘ప్రతినిథి-2’ చిత్రంలోనూ ఆమె నటించిందని.. ఇప్పుడు ఆమెతోనే ఆయన నిశ్చితార్థం జరగనుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో.. రోహిత్ నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు