బాలయ్య సినిమాలో నారా రోహిత్ ?

బాలయ్య సినిమాలో నారా రోహిత్ ?

Published on Nov 22, 2020 3:00 AM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో మరో హీరో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్ ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అట. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. వచ్చే వారం ఈ చిత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకోలేక నారా రోహిత్ ఈ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు