సమీక్ష : “నరకాసుర” – కొన్ని చోట్ల ఓకే అనిపించే యాక్షన్ డ్రామా

సమీక్ష : “నరకాసుర” – కొన్ని చోట్ల ఓకే అనిపించే యాక్షన్ డ్రామా

Published on Nov 4, 2023 3:02 AM IST
Narakasura Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్దనన్, సంగీత విపిన్, శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమన్, తేజ్ చరణ్‌రాజ్, తదితరులు

దర్శకుడు : సెబాస్టియన్ నోహ్ అకోస్టా జూనియర్

నిర్మాతలు: డాక్టర్ అజ్జ శ్రీనివాస్, కారుమూరు రఘు

సంగీతం: ఏఐఎస్ నౌఫల్ రాజా

సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

ఎడిటర్: సిహెచ్ వంశీ కృష్ణ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ‘పలాస’ ఫేమ్ నటుడు రక్షిత్ అట్లూరి నటించిన చిత్రం “నరకాసుర” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక ఈ చిత్రం కథలోకి వస్తే..ఈ సినిమా సెటప్ ఆంధ్ర, తమిళనాడు బార్డర్ దగ్గర ఓ ప్రాంతం అయిన చిన్న గ్రామం పులికండ్రిగ అనే చోట కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఉండే శివ(రక్షిత్ అట్లూరి) ఆ ఊరి బాగు కోసం దూరమైనా వెళ్తాడు అలాగే అక్కడి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే నాగమనాయుడు(చరణ్ రాజ్) కి శివకి మంచి అనుబంధం ఉంటుంది. నాగమనాయుడు కోసం కూడా శివ ఎంతో చేస్తాడు. మరి ఈ క్రమంలో తన ప్రేయసి మీనాక్షి(అపర్ణ జనార్దన్) తో బయటకి వెళ్లిన శివకి ఆ పరమశివుని కొలుచుకునే కొందరు ప్రత్యేకమైన అర్ధనారులు(హిజ్రాలు) కలవడం అక్కడ నుంచి సినిమా కథ ఎలా మలుపు తిరిగింది? శివ తన నాగమనాయుడుకి ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది? అనేది అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

పలాస చిత్రంతో మంచి నటనను కనబరిచిన యంగ్ నటుడు రక్షిత్ అట్లూరి ఈ చిత్రంలో కూడా మంచి పాత్రను చేసాడని చెప్పాలి. మంచి లుక్ అండ్ నటనతో అయితే తాను ఈ చిత్రంలో ఆకట్టుకుంటాడు. అలాగే ఫీమేల్ లీడ్ లో నటించిన అపర్ణ జనార్దన్ బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే మరో నటి సంగీత విపిన్ కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచింది.

అలాగే సినిమా స్టార్ట్ కొంచెం స్లోగా ఉన్నా తర్వాత అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ వరకు కూడా సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా నటుడు చరణ్ రాజ్ చాలా రోజులు తర్వాత ఓ డీసెంట్ పాత్రలో నటించారు. అలాగే శ్రీమాన్, నాజర్, తేజ్ చరణ్ రాజ్ తదితరులు తమ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ఫైనల్ గా నటుడు శత్రు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి ఇంప్రెస్ చేస్తాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ చిత్రంలో చాలా డిజప్పాయింటింగ్ అంశాలు ఉన్నాయని చెప్పాలి. సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక డల్ నోట్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే ఇంటర్వెల్ బ్లాక్ సమయానికి దర్శకుడు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ అభిప్రాయాన్ని సెకండాఫ్ చూసాక మార్చుకోవచ్చు.

అనవసర ల్యాగ్ నరేషన్ తో అయితే దర్శకుడు బోరింగ్ కథనాన్ని నడిపించాడు. అలాగే ఒక టైం లో అయితే అసలు తాను ఏం చెప్పాలి అనుకుంటున్నాడు కానీ ఏం చూపిస్తునాడో దేనికీ పొంతన ఉండదు.

సమాజంలో హిజ్రాల విషయంలో ఏదో చిన్న పాయింట్ ని పట్టుకున్నాడు కానీ దానిని ఎంగేజింగ్ గా చూపించడంలో విఫలం అయ్యాడని చెప్పాలి. అలాగే నటుడు శత్రు, చరణ్ రాజ్ పాత్రలను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. వీటితో పాటుగా సినిమాలో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి ఉంటే బాగున్ను దీనితో సినిమా బోర్ ఫీల్ కొంచెం అయినా తగ్గి ఉండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. సెటప్ అంతా బాగానే ఉంది. ఇక టెక్నీకల్ టీం లో యాక్షన్ సీక్వెన్స్ లలో వి ఎఫ్ ఎక్స్ సరిగా చేయాల్సింది. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫిలు పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు సెబాస్టియన్ నోఆహ్ అకోస్టా జూనియర్ విషయానికి వస్తే.. ఓకే తాను ఈ సృష్టిలో పుట్టిన ఆడ మగ వీరు కాకుండా ఇద్దరి కలయికలో పుట్టిన అంతా ఒకటే అని చెప్పాలి అనుకోవడం బాగానే ఉంది. కానీ అసలు ఈ పాయింట్ ని సాగదీసి అసలు ఇంకేదో తాను చెప్పాడు. చాలా వీక్ వర్క్ అయితే ఈ చిత్రానికి అందించాడు. సింపుల్ గానే చెప్పాల్సిన కథని ఏవేవో పాయింట్స్ ఇరికించి ఒక డల్ డ్రామాని అయితే అందించాడు అని చెప్పాలి. ఆ స్క్రీన్ ప్లే ని బెటర్ గా డిజైన్ చేసి అసలు తాను అనుకున్న పాయింట్ ని ఇంకో వెర్షన్ లో ఏమన్నా ట్రై చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూస్తే ఈ “నరకాసుర” చిత్రంలో మరీ అంత ఇంప్రెస్ చేసే అంశాలు అయితే పెద్దగా లేవు. హీరో నటన కొందరు నటీనటుల నటన ఫస్టాఫ్ లో మంచి కామెడీ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటాయి. కాకపోతే మెయిన్ గా దర్శకుడు ఒక మంచి పాయింట్ నే తీసుకున్నాడు కానీ దానిని తానే నీరుగార్చాడు..దీనితో స్ట్రిక్ట్ గా యాక్షన్ సీక్వెన్స్ లు వరకు ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు