బాలయ్య @ 50 ఇయర్స్.. సత్తా చాటేందుకు వస్తున్న ‘నరసింహ నాయుడు’

బాలయ్య @ 50 ఇయర్స్.. సత్తా చాటేందుకు వస్తున్న ‘నరసింహ నాయుడు’

Published on Aug 26, 2024 4:31 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలో విజయవంతంగా 50 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సిద్ధమవుతోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక అభిమానులు కూడా తమ అభిమాన నటుడి 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

దీని కోసం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘నరసింహ నాయుడు’ మూవీని రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్టు 30న ‘నరసింహ నాయుడు’ 4K వెర్షన్ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన ‘నరసింహ నాయుడు’ సినిమాలో సిమ్రాన్, ప్రీతి ఝంగియాని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. మరి ‘నరసింహ నాయుడు’ రీ-రిలీజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు