విజయేంద్ర ప్రసాద్ పై మోడీ ఆసక్తికర పోస్ట్.!

Published on Jul 7, 2022 8:00 am IST


తాజాగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం పలు రాజ్య సభ అభ్యర్ధులని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి వారిలో వారి కళతో దేశ సంస్కృతికి తోడ్పాటు అందించిన దిగ్గజాలకు ఈ అపారమైన గౌరవాన్ని అందజేసింది. మరి వీరిలో పాన్ ఇండియా రచయిత మన తెలుగు వారు అయిన వి విజయేంద్ర ప్రసాద్ కి రాజ్య సభలో చోటు దక్కినట్టుగా కేంద్ర ప్రభుత్వం నిన్న అనౌన్స్ చేయడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరి విజయేంద్రప్రసాద్ పై దేశ ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్ పెట్టడం జరిగింది. “శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తంపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు.” అంటూ అసలు విషయం తెలియజేసారు.

సంబంధిత సమాచారం :