పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇప్పుడు ఊహించని స్థాయి హై లో ఉన్నారని చెప్పాలి. పవన్ ఈ ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించడం అయితేనేం, తాను మొదటిసారిగా చట్ట సభల్లో అడుగు పెట్టనుండడం అయితేనేం నిన్న మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబీకులతో కలిసి కనిపించిన విజువల్స్ పవన్ అభిమానులకి పవన్ సహా మెగా అభిమానులు అందరికీ లైఫ్ టైం మెమోరీస్ అని చెప్పడంలో సందేహమే లేదు.
మరి ఇన్ని హై ల నడుమ మరో ఊహించని ఎలివేషన్ పవన్ పై అది కూడా దేశ ప్రధాని నుంచి పడింది. ఇవాళ పాత పార్లమెంట్ లో ఎన్డీయే మీటింగ్ జరుగగా అందులో పవన్ సహా 12 మంది ముఖ్య నాయకులు మోడీతో కలిసి కూర్చొని తమ ఎన్డీయే నాయకునిగా మోడీని ఎన్నుకున్నారు. ఈ సమయంలో మోడీ పవన్ కోసం మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
పవన్ అంటే పవనం(గాలి) కాదు తుఫాన్.. అంటూ కొనియాడారు. అంతే కాకుండా అతడు హిందూస్తాన్ లో ప్రతి సామాన్యుడి తాలూకా వికాసానికి ప్రతితిబింబం అని పార్లమెంట్ సాక్షిగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో నాయకుల ముందు ఎన్ని భారీ భారీ సినిమాల్లో కూడా ఇవ్వలేని మాస్ ఎలివేషన్ ని అందించారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు నేషనల్ లెవెల్లో ఓ రేంజ్ లో వైరల్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్ – ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు
ये पवन नहीं हैं , आंधी है!@narendramodi @PawanKalyan#NDAMeeting#GameChangerPK pic.twitter.com/AmaXRBuHUt
— JanaSena Party (@JanaSenaParty) June 7, 2024