డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

Published on Nov 23, 2024 7:05 PM IST

ప్రిస్కో, టెక్సాస్: నవంబర్:22 అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు జయంతి సందర్భంగా ప్రతి యేటా నాట్స్ డల్లాస్ విభాగం బాలల సంబరాలు నిర్వహిస్తోంది. గత పద్నాలుగు ఏళ్లుగా ఓ సంప్రదాయంలా నిర్వహిస్తున్నఈ సంబరాలను ఈ సారి ప్రిస్కో నగరంలో వండేమేట్టర్ మిడిల్ స్కూలులో ఘనంగా జరిపింది. బాలల సంబరాల్లో భాగంగా చదరంగం, గణితం, సంగీతం నృత్యం, తెలుగు పదజాలం, తెలుగు ఉపన్యాసం విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపుగా 250 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దరఖాస్తు చేసుకున్న పిల్లల్ని వివిధ వయసుల వారీగా విభజించి ఈ పోటీలు నిర్వహించారు. నాట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు విద్యార్థులే కాకుండా, ఇతర ప్రవాస భారతీయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సాంప్రదాయ సంగీతం, నృత్యంతో పాటు సినిమా సంగీతం, నృత్యం విభాగాల్లో జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు పదజాలం, తెలుగు ప్రసంగ పోటీల్లో అనర్ఘళంగా తెలుగు మాట్లాడి అతిథులను అబ్బురపరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో దాదాపు 90 మందికి పైగా పిల్లలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి నేతృత్వంలో ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు మూడు నెలల ముందు నుండే పక్కా ప్రణాళికతో బాలల సంబరాలను నాట్స్ డల్లాస్ బృందం విజయవంతం చేసింది.

నాట్స్ బాలల సంబరాలకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఉప కోశాధికారి రవి తాండ్ర, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారెలు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, మార్గదర్శకత్వం బాలల సంబరాల విజయానికి దోహదపడ్డాయని స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి తెలిపారు.
డల్లాస్ చాప్టర్ సలహా బోర్డు సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, కవిత దొడ్డ, డీ వీ ప్రసాద్, రవీంద్ర చుండూరు, డాలస్ చాప్టర్ జట్టు సభ్యులు సౌజన్య రావెళ్ల , కావ్య కాసిరెడ్డి, పావని నున్న, శ్రీనివాస్ ఉరవకొండ, కిరణ్ నారె, ఉదయ్, నాగార్జున, బద్రి బియ్యపు, మోహన్ గోకరకొండ, యూత్ టీం నుండి నిఖిత, సహస్ర, ప్రణవి, వేద శ్రీచరణ్, అద్వైత్, ధృవ్, పావని, అమితేష్, ఈశ్వర్, చంద్రాంక్ తదితరులు నాట్స్ బాలల సంబరాల్లో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు