ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ లో రిలీజ్ కి వస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కించిన రెండో చిత్రం “సరిపోదా శనివారం” కోసమే అని చెప్పాలి. వీరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో ఒక హిట్టు పడితే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నారు.
మరి అందుకు తగ్గట్టుగానే “సరిపోదా శనివారం” డే 1 నుంచి కూడా ఓ రేంజ్ లో హైప్ ని సెట్ చేసుకుంది. అప్డేట్ అప్డేట్ తో సినిమాపై బజ్ పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఆన్ టైం షూటింగ్ కంప్లీట్ అవ్వడం నుంచి ఇప్పుడు థియేటర్స్ లోకి సినిమా రావడం వరకు మేకర్స్ అంతా పర్ఫెక్ట్ గానే చేసేసారు. అయితే ఇందులో చాలా మందికి తెలియని విషయం నాని ఈ సినిమా విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు.
సినిమా స్టార్టింగ్ రోజు నుంచి నటుడిగానే కాకుండా ఇప్పుడు రిలీజ్ కి వచ్చే వరకు ఒక సినీ ప్రేమికుడిగా తన సినిమా కోసం ఈ మధ్య కాలంలో స్టార్స్ వదిలేసిన ప్రమోషన్స్ నుంచి సినిమా రిలీజ్ దర్శకుడుకి బాగోకపోతే సినిమా కంటెంట్ డెలివర్ వరకు అన్నీ తానై నడిపిస్తున్నాడు అని చెప్పాలి. ఈ రోజుల్లో చాలా చిత్రాలు పాన్ ఇండియా సినిమాలుగా అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ కి వచ్చేసరికి ఆ ఆలోచన నుంచే డ్రాప్ అవుతున్నాయి. కానీ నాని మాత్రం డిఫరెంట్ అని చెప్పాలి.
అనౌన్స్ చేస్తే ఆ భాషల్లో విడుదల చేయడమే కాకుండా ప్రతి భాషలో ప్రతి ఇండస్ట్రీకి వెళ్లి మరీ అక్కడ ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇది ప్రస్తుతం చాలా మంది హీరోస్ వదిలేశారని చెప్పాలి. కానీ నాని మాత్రం రేపు సినిమా రిలీజ్ ఉండగా ముందు రోజు వరకు నాని తన సినిమా కోసం కష్టపడుతున్నాడు. దీనితో సినిమా పట్ల తనకున్న ఇంట్రెస్ట్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆల్రెడీ ఆన్లైన్ లో బుకింగ్స్ అది కూడా వీక్ డే గురువారం నాడు బుకింగ్స్ అదిరే లెవెల్లో కనిపిస్తున్నాయి. తెల్లవారు 7 గంటల షోస్ అయితే తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల ఫుల్స్ పడిపోయాయి. మరి టైర్ 2 హీరోస్ లో ఈ రేంజ్ బ్యాటింగ్ మరోసారి నానికే చెల్లింది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి సాలిడ్ ట్రెండ్ లోనే ఉన్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని తెలుగు స్టేట్స్ లో సహా యూఎస్ మార్కెట్ లో మొదటి రోజు కొట్టేలా కనిపిస్తుంది.
ఇక ఒక్క టాక్ పాజిటివ్ గా పడితే మిగతా అంతా థియేటర్స్ లో నాచురల్ స్టార్ చూసుకుంటాడు.. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.