ఓటిటి డేట్ ఫిక్స్ చేసిన ‘లవ్ మౌళి’

ఓటిటి డేట్ ఫిక్స్ చేసిన ‘లవ్ మౌళి’

Published on Jun 22, 2024 7:00 PM IST

హీరో నవ‌దీప్ న‌టించిన రీసెంట్ మూవీ ‘ల‌వ్ మౌళి’ మంచి అంచ‌నాల మ‌ధ్య బాక్సాఫీస్ వ‌ద్ద రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించినా, అనుకున్న స్థాయిలో ఈ మూవీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఇక ఈ సినిమాలో న‌వదీప్ ప‌ర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యింది.

ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర తెర‌కెక్కించిన ఈ బోల్డ్ రొమాంటిక్ మూవీ ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. కాగా, ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ‘ల‌వ్ మౌళి’ చిత్రాన్ని జూన్ 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు.

ఈ సినిమాలో పంఖురి గిద్వాని హీరోయిన్ గా న‌టించ‌గా, టాలీవుడ్ హ‌ల్క్ రానా ద‌గ్గుబాటి ఇందులో ఓ కేమియ‌లో రోల్ లో క‌నిపించారు. గోవింద్ వసంత సంగీతం అందించిన ‘ల‌వ్ మౌళి’ మూవీ ఓటిటి ఆడియెన్స్ ను ఎంత‌మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు