మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయితన పోస్టర్స్, టీజర్, సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమాలోని మరో ఇంటెన్స్ క్యారెక్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
‘మట్కా’ చిత్రంలో ‘సాహు’ అనే పాత్రలో విలక్షణ నటుడు నవీన్ చంద్ర నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. స్కూటర్‌పై వెళ్తున్న నవీన్ చంద్ర సరికొత్త లుక్‌తో కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు ఇంట్రెస్టింగ్ లుక్స్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకోనున్నాడు. జీవి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.