బిగ్‌బాస్ 5: ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు వైల్ద్ కార్డ్ ఎంటీ ఇస్తున్నారా?

Published on Sep 15, 2021 2:36 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 రసవత్తరంగా జరుగుతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోయింది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు కంటెస్టెంట్ లిస్ట్‌లో యాంకర్ వర్షిణీ, సీరియల్ నటి నవ్య స్వామి పేరు బలంగా వినిపించాయి. కానీ వీరిద్దరిలో ఒక్కరు కూడా హౌస్‌లోకి వెళ్ళలేదు. అయితే వర్షిణీ, నవ్యలను కావాలనే ఆపినట్టు తెలుస్తుంది.

ప్రతి సీజన్‌లో ఉన్నట్టుగానే ఈ సారి సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ద్వారా కొందరిని హౌస్‌లోకి పంపబోతున్నారట. అయితే వర్షిణీ, నవ్య ఇద్దరిలో ఒకరిని రెండో వారం కాని లేక మూడో వారం కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించి, ఆ తర్వాత వారం మరొకరిని పంపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వీరిద్దరు హౌస్‌లోపలికి వెళితే కనుక ఈ సీజన్ ఇంకాస్త క్రేజీగా మారడం ఖాయమనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :