థ్రిల్లింగ్, హర్రర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న నయనతార ‘కనెక్ట్’ టీజర్

థ్రిల్లింగ్, హర్రర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న నయనతార ‘కనెక్ట్’ టీజర్

Published on Dec 5, 2022 6:40 PM IST

స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో యువ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ హర్రర్ డ్రామా మూవీ కనెక్ట్. నయనతార భర్త విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని తెలుగులో ప్రముఖ సంస్థ యువి క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. గతంలో అశ్విన్ తో కలిసి నయనతార మాయ అనే హర్రర్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన కనెక్ట్ మూవీ నుండి నేడు కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్.

హర్రర్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు నటుడు అనుపమ్ ఖేర్, లీవ్ ద రూమ్ నౌ అంటూ దెయ్యాన్ని శాసించే సన్నివేశం టీజర్ లో బాగుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, పాత్రధారుల నటన వెరసి ప్రస్తుతం కనెక్ట్ టీజర్ ని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసి మూవీ పై మరింతగా హైప్ ఏర్పరిచింది అనే చెప్పాలి. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హానియా నఫీస్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా ఈ మూవీని డిసెంబర్ 22 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు