ప్రేమగా చూసుకునే వ్యక్తి భర్తగా రావాలి – నయనతార

ప్రేమగా చూసుకునే వ్యక్తి భర్తగా రావాలి – నయనతార

Published on Jul 1, 2014 12:30 PM IST

nayanthara
ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో నయనతారపై వచ్చిన పుకార్లు మరే ఇతర నటిపై రాలేదంటే అతిశయోక్తి కాదు. శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. కారణాలు ఏవైనా నయనతారకు రెండు సార్లు చేదు అనుభవమే ఎదురైంది. ప్రేమ విఫలం అయిన సమయంలో ఆమెపై ఎన్నో పుకార్లు, వదంతులు వచ్చాయి. వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కుని నెంబర్ వన్ హీరోయిన్’గా అవతరించారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో మెరిసినా ప్రస్తుతం అభినయనికి ఆస్కారం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతార మరోసారి ప్రేమ కబుర్లు చెప్తుంది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో? ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో? ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అబద్దాలు చెప్పేవారు అంటే తనకు నచ్చదని, కాబోయే భర్తలో నిజాయితి ముఖ్యమని చెప్పింది. తనతో పాటు తన కుటుంబానికి కూడా గౌరవం ఇవ్వాలని, అన్నిటికంటే తనను ప్రేమగా చూసుకోవాలని మనసులో భావాలను వెల్లడించింది. కాబోయే భర్త నుంచి నయనతార ప్రేమను కోరుకుంటుందని వెల్లడయ్యింది.

నయనతార తాజా వ్యాఖ్యలను విన్నవారు మరోసారి ప్రేమలో పడిందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు