నవంబర్ 18 వ తేదీ నయన తార పుట్టిన రోజు. ‘శ్రీ రామ రాజ్యం’ రూపేన ఈ బర్త్ డే ఆమెకు ఓ మధురానుభూతిని మిగిల్చింది. నిన్న విడుదలైన శ్రీరామ రాజ్యం చిత్రం లో నయన తార అద్భుత నటనకు సర్వత్ర ప్రశంసలు వస్తున్నాయి. సినీ పండితుల అంచనాల ప్రకారం సీతా గా ఆమె నటనకు ఎన్నో అవార్డులు వరిస్తాయని అంచనా వేస్తున్నారు.
అంతా భావిస్తున్నట్టు నయనతార చివరి ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో ఆమె ప్రదర్శించిన నటన, ఆమె నట జీవితంలోనే అత్యున్నత ప్రదర్శనగా నిలుస్తుందని భావిస్తున్నారు. 1984 వ సంవత్సరంలో ఓ మలయాళ క్రిస్టియన్ ఫ్యామిలీ లో జన్మించిన ఈమె మొదటి పేరు డయానా మరియం కురియన్. ఆమె 2003 వ సంవత్సరంలో మలయాళ చిత్ర సీమలోకి అడుగిడారు. అయితే నయన కరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం 2005 లో వచ్చిన సూపర్ స్టార్ రజని కాంత్ ‘చంద్ర ముఖి’. ఈ సినిమా తో అటు తమిళ, తెలుగు భాషల్లో ఆమె పూర్తి స్తాయిలో గుర్తింపు పొందారు. అనంతరం ప్రముఖ నటీమణుల జాబితాలో చేరిపోయారు.
నయనతార ఆగష్టు లో హిందూ మతం లోకి మారారు. ఆమె స్క్రీన్ నేమ్ అయిన నయనతార ను అధికారిక పేరుగా మార్చుకున్నారు. డ్యాన్సింగ్ లెజెండ్ ప్రభుదేవా ను వచ్చే ఏడాది పెళ్ళా డేందుకు సైతం మార్గం సుగమమైంది.
పుట్టినరోజు సందర్భంగా నయన తారకు శుభాకాంక్షలు తెలుపుతోంది 123 తెలుగు . కామ్