లేటెస్ట్..నయన్ ఫస్ట్ లుక్ తో “గాడ్ ఫాథర్” రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ..!

నిన్నటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గాడ్ ఫాథర్” రిలీజ్ విషయంలో కాస్త సస్పెన్స్ అలా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సాలిడ్ హంగులతో తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ అయితే వాయిదా పడినట్టుగా టాక్ రాగా నిన్ననే మేకర్స్ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలో కీలక పాత్రకి గాను స్టార్ హీరోయిన్ నయనతార చేస్తుండగా ఇప్పుడు మేకర్స్ అయితే నయన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. మరి ఈ చిత్రంలో నయన్ ని సత్యప్రియ జై దేవ్ గా పరిచయం చేశారు. ఇక దీనితో పాటుగా అయితే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేసారు. సినిమా అనుకున్నట్టుగానే అక్టోబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా ఆ డేట్ ని ఈ పోస్టర్ లో పొందుపరిచారు. దీంతో అయితే ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఖరారు అయ్యింది.

Exit mobile version