“బాలయ్య 109” పై ప్రొడ్యూసర్ సాలిడ్ కాన్ఫిడెన్స్!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ చిత్రం కోసం తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా ఫ్యాన్స్ లో అయితే సినిమా అవుట్ పుట్ కి సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నిర్మాత యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అభిమానులు ఈ సినిమా విషయంలో ఎన్ని అంచనాలు పెట్టుకొని అయినా రావచ్చని. వాటిని రీచ్ అయ్యే విధంగా వాటికి మించే ఈ సినిమా ఉంటుంది అని తాను చాలా నమ్మకంగా తెలిపారు. దీనితో బాలయ్య అభిమానులు ఈ కాన్ఫిడెన్స్ చూసి మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version