దీపావళికె ‘NBK 109’ అవైటెడ్ ట్రీట్.. కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ‘NBK 109’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ దీపావళికి టైటిల్ టీజర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై నాగవంశీ ఇది వరకే క్లారిటి ఇచ్చారు కానీ ఆ డేట్ అనౌన్సమెంట్ ని అధికారికంగా ఇవ్వాలని అభిమానులు చూస్తున్నారు. ఇక ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట.

కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version