సమీక్ష : నీ దారే నీ కథ – స్లోగా సాగే రొటీన్ లైఫ్ జర్నీ !

సమీక్ష : నీ దారే నీ కథ – స్లోగా సాగే రొటీన్ లైఫ్ జర్నీ !

Published on Jun 15, 2024 3:03 AM IST
Nee Dhare Nee Kadha Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్ తదితరులు.

దర్శకుడు: వంశీ జొన్నలగడ్డ రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ

సంగీత దర్శకుడు: ఆల్బర్ట్టో గురియోలి

సినిమాటోగ్రఫీ:ఎలెక్స్ కావు

ఎడిటింగ్:విపిన్ సామ్యూల్ నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ

సంబంధిత లింక్స్: ట్రైలర్

కథ :

అర్జున్ (ప్రియతమ్ మంతిని) తన స్నేహితులు రాహుల్, విజయ్ లతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటారు. ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీంను బిల్డ్ చేసి ఒక మంచి మ్యూజిషియన్ గా ఎదగాలనేది అతని కోరిక. తనకు తన తండ్రి (సురేష్) సపోర్ట్ ఉంటుంది. ఐతే, అర్జున్ ఆర్కెస్ట్రా టీమ్ లోని రాహుల్ తప్పుకోవడంతో సమస్య వస్తోంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా అర్జున్ కి సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది ?, అర్జున్ ఒక మంచి మ్యూజిషియన్ గా ఎదిగాడా ? లేడా ? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

నిజంగానే ఈ ‘నీ దారే నీ కథ’ ప్రధాన కథాంశం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉంటుంది. వంశీ జొన్నలగడ్డ ఎంచుకున్న కథలో కొన్ని ఎమోషన్స్ కూడా సహజంగా సాగాయి. రియల్ పాయింట్ చుట్టూ సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని దర్శకుడు వంశీ బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. ముఖ్యంగా నచ్చిన పని కోసం ఎంత ఫ్యాషన్ గా పని చేయాలో చెప్పిన సినిమా ఇది.

సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా బాగుంది. ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎమోషనల్ అండ్ సీరియస్ సన్నివేశాల్లోని ప్రియతమ్ మంతిని నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. మరో కీలక పాత్రలో నటించిన విజయ విక్రాంత్ చాలా బాగా నటించాడు. అతని లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగున్నాయి. మరో ప్రధాన పాత్రలో కనిపించిన అనంత పద్మశాల నటన బాగుంది. అంజన బాలాజీ, వేద్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

మైనస్ పాయింట్స్:

ఈ ‘నీ దారే నీ కథ’ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. అలాగే, గుడ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా రెగ్యులర్ గానే ఉంది. అలాగే, ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి.

మొత్తానికి కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు వంశీ జొన్నలగడ్డ బాగానే ప్రయత్నం చేశాడు, కొన్ని చోట్ల ఆ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయినా, క్లైమాక్స్ మాత్రం సింపుల్ గా ఎండ్ అయిపోయింది. పైగా సింపుల్ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో కొన్ని చోట్ల సినిమాని సాగదీశారు.

మొత్తానికి ఈ ‘నీ దారే నీ కథ’ మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మంచి ఎమోషనల్ డ్రామాకి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. ఐతే, సినిమాలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. సినిమాలో ఎలెక్స్ కావు సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. ఆల్బర్ట్టో గురియోలి సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. విపిన్ సామ్యూల్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

‘నీ దారే నీ కథ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లైఫ్ జర్నీ డ్రామా.. కొన్ని చోట్ల ఎమోషనల్ ఎలిమెంట్స్ తో బాగానే ఆకట్టుకుంది. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. కానీ, ఈ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ మూవీలో మెసేజ్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు