‘శ్వాగ్’ నుండి ‘నీలో నాలో’ లిరికల్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్వాగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా, ఈ సినిమా నుండి మరో మెలోడి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

‘నీలో నాలో’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ శ్రీ విష్ణు, మీరా జాస్మిన్‌లపై చిత్రీకరించారు. భువనచంద్ర అందించిన చక్కటి లిరిక్స్‌కి వివేక్ సాగర్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటను రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్యలను ఆలపించారు. ఈ పాట ఆద్యంతం వినసొంపుగా ఉండటం శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు 4 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version