IPL 2025: చెన్నై, ఆర్సీబి మ్యాచ్.. ధోనిపై విమర్శలు

IPL 2025: చెన్నై, ఆర్సీబి మ్యాచ్.. ధోనిపై విమర్శలు

Published on Mar 29, 2025 11:03 AM IST

ప్రస్తుతం మన ఇండియన్ క్రికెట్ దగ్గర బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఐపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో బిగ్గెస్ట్ టీంల నడుమ ఆల్రెడీ పలు మ్యాచ్ లు జరిగాయి. అలా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలానే చెన్నై సూపర్ కింగ్స్ నడుమ జరిగిన మ్యాచ్ కూడా ఒకటి. అయితే ఐపీఎల్ హిస్టరీలోనే వీరిది బిగ్గెస్ట్ రైవల్ అని చెప్పవచ్చు.

మరి నిన్న ఎంతో ఉత్కంఠగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ లో చెన్నై ఆరంభం నుంచే చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్ లో అంతా ధోని కోసం ఎదురు చూస్తుంటే తాను కష్ట కాలంలో కాకుండా మ్యాచ్ చేతిలో లేనప్పుడు రావడం ఇపుడు పలు విమర్శలకి దారి తీసింది. రవి చంద్రన్ అశ్విన్ వచ్చిన సమయానికి ఇంకా చెన్నైకి అవకాశాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో ధోని రాకపోవడం పెద్ద బ్లండర్ గా మారింది.

ఒకవేళ ఆ సమయంలోనే వచ్చి ఉంటే బాగుండేది అని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా వీటితో పాటుగా ముందు బాల్స్ అంతా వేస్ట్ చేసి తదుపరి లాస్ట్ ఓవర్లో సిక్సర్ లు బాదడం అనేది మరింత విమర్శలకి దారి తీసింది. ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండేదిగా అని తనపై సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇపుడు కెప్టెన్ ధోనీ కాదు తాను ఎప్పుడు దిగాలి అనేది తన నిర్ణయం కూడా కాకపోవచ్చు మరి ఇందుకు కారణం ఏంటి అనేది పక్కన పెడితే ప్రస్తుతం ధోనిపై విమర్శలు కొనసాగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు