ప్రామిసింగ్ ఎంటర్టైనర్ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” ట్రైలర్.!

ప్రామిసింగ్ ఎంటర్టైనర్ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” ట్రైలర్.!

Published on Sep 8, 2022 5:05 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా సోనూ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఒక ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫైనల్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదగా మేకర్స్ అయితే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయించారు.

అయితే ఈ ట్రైలర్ మాత్రం మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. డీసెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో అలాగే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకునే కనిపిస్తుంది. అలాగే నటుడు ఎస్ వి కృష్ణా రెడ్డి ని చాలా కాలం తర్వాత సినిమాల్లో చూడడం బాగుంది. ఇంకా కిరణ్ అబ్బవరం డీసెంట్ పెర్ఫామెన్స్ తో సెటిల్డ్ గా కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ తో కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఇంకా ఈ ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా అయితే మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది ఇది డెఫినెట్ గా సినిమాలో మంచి హైలైట్ గా అవుతుందని అర్ధం అవుతుంది. అలాగే కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తానికి అయితే ఈ ట్రైలర్ మాత్రం మంచి ఎలిమెంట్స్ తో బాగానే ఉంది ఈ సెప్టెంబర్ 16న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు