డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “నేను స్టూడెంట్ సర్”

నేను స్టూడెంట్ సర్, బెల్లంకొండ గణేష్ ప్రధాన పాత్రలో నటించిన ఒక చిన్న బడ్జెట్ చిత్రం. నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇది జూన్ 2, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అవంతిక దాసాని కథానాయికగా కూడా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2023 జూలై 14న ఆహా వీడియోలో ఈ చిత్రం డిజిటల్‌గా అరంగేట్రం చేయనుందనేది తాజా వార్త. థియేటర్లలో మిస్ అయిన వారికి ఇది శుభవార్త. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడిగా, SV2 ఎంటర్టైన్మెంట్‌ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు.

Exit mobile version