బన్నీ మాస్ క్రేజ్.. ‘పుష్ప’ గాడి రూల్ కింద నెట్ ఫ్లిక్స్

బన్నీ మాస్ క్రేజ్.. ‘పుష్ప’ గాడి రూల్ కింద నెట్ ఫ్లిక్స్

Published on Jan 30, 2025 11:02 AM IST

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్”. గత ఏడాదిలోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం లేటెస్ట్ గానే ఓటిటిలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి సినిమా స్ట్రీమింగ్ కి రావడంతో ఓటిటిలో పుష్ప 2 రూల్ స్టార్ట్ అయ్యిపోయింది. అయితే లేటెస్ట్ గా ఇండియా నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వారు బన్నీ మాస్ క్రేజ్ ఏంటో చూపించారు.

తమ ఇంస్టాగ్రామ్ బయోలో తమ అకౌంట్ ఇపుడు నుంచి పుష్ప గాడి రూల్ లో ఉందని మాస్ ఎలివేషన్ అందించారు. మరి గతంలో కూడా అల్లు అర్జున్ కి నెట్ ఫ్లిక్స్ వారు ఇదే తరహాలో తాము ఫ్యాన్ పేజీ అన్నట్టుగా కూడా క్రేజీ పోస్ట్స్ పెట్టడం జరిగింది. దీనితో ఈ మెంటల్ మ్యాడ్నెస్ మూవ్ ఇపుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు