నెట్‌ఫ్లిక్స్ అంథాల‌జీ ఫిల్మ్ ‘న‌వ‌ర‌స‌’పై ప్రశంసల వర్షం..!

ప్ర‌ముఖ డిజిట‌ల్ మాధ్య‌మం నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుద‌లైన అంథాల‌జీ చిత్రం ‘న‌వ‌ర‌స‌’పై ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మంతా ఏక‌తాటిపైకి రావ‌డంపై అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియా, సింగ‌పూర్‌, మ‌లేషియా, యుఏఈ స‌హా ప‌ది దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించి ‘న‌వ‌ర‌స‌’ అంథాల‌జీ చిత్రం టాప్ టెన్‌లో నిలిచింది.

ఇండియ‌న్ సినిమాల్లో ఏస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గ‌జం మ‌ణిర‌త్నం, సీనియ‌ర్ ఫిల్మ్ మేక‌ర్ జ‌యేంద్ర‌న్ పంచ‌ప‌కేశ‌న్ ఆధ్వర్యంలో కోపం, కరుణ, ధైర్యం, అసహ్యత, భయం, నవ్వు, ప్రేమ, శాంతి మరియు అద్భుతం ఇలా తొమ్మిది భావోద్వేగాలతో ‘న‌వ‌ర‌స‌’ను రూపొందించారు. న‌వ‌ర‌స అంథాల‌జీ కోసం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మంతా క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసింది.

నవరస సక్సెస్‌పై మ‌ణిర‌త్నం, జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్ మాట్లాడుతూ ఒక మన దేశంలోనే కాకుండా సింగ‌పూర్‌, మ‌లేషియా, యూఏఈ వంటి దేశాల్లో ‘న‌వ‌ర‌స‌’కు వ‌చ్చిన స్పంద‌న చూసి మా మ‌న‌సులు ఆనందంతో నిండిపోయాయని, ఈ అంథాల‌జీని వీక్షించిన వారిలో 40 శాతం మంది బ‌య‌ట దేశానికి చెందిన ప్రేక్ష‌కులే కావ‌డం విశేషమని అన్నారు. ‘న‌వ‌ర‌స‌’ రూప‌క‌ల్ప‌న‌కు చాలా మంది స‌హ‌కారం అందించారని, నెట్‌ఫ్లిక్స్ వారి స‌హ‌కారంతో చేసిన ఈ గొప్ప ప్ర‌య‌త్నాన్ని గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకుంటుంన్నామని, దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేశారు.

డిజిట‌ల్ రంగంలో వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్‌గా రాణిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌కు 208 మిలియ‌న్స్ మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారని, 190 దేశాల‌కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు, డిఫ‌రెంట్ జోన‌ర్స్ కంటెంట్‌తో ప‌లు భాష‌ల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోందని అన్నారు. వీక్షకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడ‌టం, అవసరముంటే ఆపేసుకుని, మళ్లీ ఆపేసిన చోట నుంచే వీక్షించే అవకాశం ఉందని, ఈ సమయంలో ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ ఉండ‌వవు. నెట్‌ఫ్లిక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి లేటెస్ట్ న్యూస్‌, అప్‌డేట్స్ కొరకు IG@Netflix_IN, TW@Netflixindia TW South@Netflix_INSouth and FB@NetflixIndiaల‌ను ఫాలోకండి.

Exit mobile version