ఓటీటీ సమీక్ష : టెస్ట్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Test Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్
దర్శకత్వం : ఎస్.శశికాంత్
నిర్మాతలు : చక్రవర్తి, రామచంద్ర, ఎస్.శశికాంత్
సంగీతం : శక్తిశ్రీ గోపాలన్
సినిమాటోగ్రఫీ : విరాజ్ సింగ్ గోహిల్
ఎడిటర్ : టి.ఎస్.సురేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘టెస్ట్’ నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఎస్.శశికాంత్ డైరెక్ట్ చేశారు. తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
అర్జున్ వెంకట్‌రామన్ (సిద్ధార్థ్) ఇండియన్ టాప్ క్రికెటర్లలో ఒకరు. కానీ, అతడి బ్యాడ్ ఫామ్ కారణంగా బోర్డు అతడిని రిటైర్ చేయాల్సిందిగా కోరుతుంది. దీనికి అతను ఒప్పుకోడు. స్కూల్ టీచర్ అయిన కుముద(నయనతార) IVF పద్దతి ద్వారా తల్లి కావాలని కోరకుంటుంది. సైంటిస్ట్ అయిన ఆమె భర్త శరవణన్(మాధవన్) దేశ భవిష్యత్తును మార్చగల ఓ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తుంటాడు. వీరి ముగ్గురు జీవితాల్లో ఎదురైన క్లిష్టమైన పరిస్థితులు ఏమిటి..? వారు ఈ పరిస్థితులను ఎలా ఎదురించారు? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
మాధవన్ మరోసారి తన డీసెంట్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరో తరహా పాత్రల్లో మెప్పించిన మాధవన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ అదరగొట్టారు. మరోసారి ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన పాత్ర ప్రేక్షకులను మరింతగా మెప్పిస్తుంది.

సిద్ధార్థ్ తన పాత్రలో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన పాత్రలో ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్ ఏమీ లేకపోయినా, దానిని ఆయన హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

నయనతార కూడా చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. మొదట్లో ఆమె పాత్ర పెద్దగా మెప్పించకపోయినా, సెకండాఫ్‌లో మాత్రం ఆమె పాత్రలో డెప్త్ కనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ లిరిష్ రాహవ్ తన సీన్స్‌లో పండించిన ఎమోషన్ ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :
ఇలాంటి స్టార్ క్యాస్టింగ్‌ను సెట్ చేసుకున్న దర్శకుడు ఎస్.శశికాంత్ వారికి గుర్తుండిపోయే పాత్రలను అందించడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా రైటింగ్‌లో గ్రిప్పింగ్ అంశాలు ఏ కోశాన కనిపించకపోవడంతో ఇదొక సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.

క్రైమ్, ఎమోషన్ కలగలిసిన స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సి ఇంటెన్సిటీ ఈ చిత్రంలో లోపిస్తుంది. ఇందులో ఒక్క సీన్ కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే విధంగా లేదు. ఎమోషనల్ సీన్స్‌లో.. ముఖ్యంగా సిద్ధార్థ్ ఉన్న సీన్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.

నటుడు నాజర్ పాత్ర సినిమాకు కొంతమేర మాత్రమే ఉపయోగపడింది. మిగతా నటీనటుల పాత్రలు కూడా సరిగ్గా డిజైన్ చేయనట్లుగా, సినిమా కథలో భాగంగా వచ్చివెళ్లిపోతాయి.

మీరా జాస్మిన్ పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాధవన్ నటన బాగున్నా, ఆయనకు చెప్పిన డబ్బింగ్ న్యాచురల్‌గా అనిపించదు. దీంతో ఆయన పాత్ర కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :
దర్శకుడిగా, రచయితగా ఎస్.శశికాంత్ ఓ చక్కటి అవకాశాన్ని వృథా చేసుకున్నారు. ఇలాంటి స్టార్స్ నటిస్తున్న సినిమాను మరింత ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఆయన మలిచి ఉండాల్సింది. కథలో ఎలాంటి పస లేదనే భావన కలుగుతుంది. విరాజ్ సింగ్ గోహిల్ సినిమాటోగ్రఫీ డీసెంట్‌గానే ఉన్నా ఎందుకో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. శక్తిశ్రీ గోపాలన్ సంగీతం కూడా కథకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. రన్‌టైమ్ విషయంలో జాగ్రత్త వహించాల్సింది. డబ్బింగ్, నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

తీర్పు :
ఓవరాల్‌గా ‘టెస్ట్’లో స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ, కథలో ఎలాంటి ఆసక్తికర అంశాలు లేకపోవడంతో ఇదొక బోరింగ్ మూవీగా నిలిచింది. మాధవన్ తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టకుంటాడు. సిద్ధార్ధ్, నయనతార తమ పాత్రలను డీసెంట్‌గా చేశారు. కానీ.. వీక్ రైటింగ్, స్లో పేస్, ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం వంటివి ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. ‘టెస్ట్’ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని టెస్ట్ చేస్తుంది. లీడ్ యాక్టర్స్ అభిమానులు కూడా ఈ వీకెండ్ వేరొక ఆప్షన్ చూసుకోవడం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version