కంగనా మీద సెటైర్లు ఆగట్లేదు


కేంద్రం ప్రకటించిన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో ఆమె, ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. నిజానికి కంగనాకు ఇది మొదటి జాతీయ పురస్కారమేమీ కాదు. ఆమెకిది మూడవ అవార్డ్. గతంలో 2015, 2016లో ఆమె ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 2020లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడ పొందారు. ఈరోజే ఆమె పుట్టినరోజు కావడం, జాతీయ అవార్డు రావడం, ఆమె కొత్త సినిమా ‘తలైవి’ టీజర్ బ్యాక్ తెచ్చుకోవడంతో ఎక్కడ చూసినా కంగనా గురించిన చర్చలే నడుస్తున్నాయి.

ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ప్రశంసలతో పాటు విమర్శలు కూడ వస్తున్నాయి ఆమె మీద. కొందరేమో ఆమెకు వస్తున్న జాతీయ పురస్కారాల వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పాలనలో ఉన్న పార్టీకి అనుకూలంగా మాట్లాడటం, ఆ పార్టీకి వ్యతిరేకమైన వారిని విమర్శించడం వంటి పనులు చేసినందువలనే ఆమెను అవార్డులు వరిస్తున్నాయని, లేకుంటే ఆమె కంటే మంచి నటులు ఉన్నారని, ఆమె చేసిన సినిమాలకంటే మంచి సినిమాలు బాలీవుడ్ నుండి వచ్చాయని వారికి కాకుండా కంగనాకే పురస్కారాలు ఎలా వస్తున్నాయని అంటున్నారు.

Exit mobile version