అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఐతే, ‘తండేల్’ చిత్రం నుంచి విడుదలైన ‘శివ శక్తి’ పాటలో సాయిపల్లవి డాన్స్‌పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూనకం వచ్చినట్లుగా ఆమె శివ తాండవం చేశారని, నాగ చైతన్య కూడా ఎప్పుడూ లేనంత ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశారని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.
ముఖ్యంగా ఈ ‘శివ శక్తి’ పాట రూపంలో సాయిపల్లవి కెరీర్ లో మరో స్పెషల్ సాంగ్ వచ్చి చేరింది. కాగా శ్రీకాకుళంలో శ్రీముఖలింగం అని ఓ పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయంలో మహా శివరాత్రిని అపారమైన భక్తితో ఎంతో వైభవంతో గొప్ప పండుగగా నిర్వహిస్తారు. కాగా, ఈ ఆలయం ప్రేరణతో ఈ సినిమా కోసం ఈ శివరాత్రి పాటను ప్లాన్ చేసింది తండేల్ టీమ్. ఈ తండేల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.