బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ పై పలువురు నెటిజన్లు సీరియస్ అవుతూ పోస్ట్ లు పెడుతున్నారు. కారణం.. రోహిత్ శర్మ కావడం విశేషం. ఐదో టెస్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మపై విద్యాబాలన్ రియాక్ట్ అవుతూ.. ‘రోహిత్ శర్మ, వాట్ ఏ సూపర్‌స్టార్’ అని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూసి ఓ నెటిజన్ ‘ముందు అతడిని మీరు ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి మేడం. ఆ తర్వాత మీరు రోహిత్ శర్మకి సపోర్ట్ చేయండి’ అంటూ సెటైర్ వేశాడు.
అయితే రోహిత్ పీఆర్ టీమ్ విద్యాబాలన్ తో ఇలా పోస్ట్ చేయించిందని మరి కొందరు నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. గతంలో కూడా విద్యాబాలన్ తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఇలాగే పోస్ట్స్ చేసి ప్రమోషన్స్ చేసిందని… కాబట్టి, ఆమె పోస్ట్ లను మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విద్యాబాలన్ అనుకోకుండా ఈ విషయంలో ఇరుక్కున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. విద్యాబాలన్ కీలక పాత్రలో నటించిన ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె మంజులిక పాత్రలో నటించి మెప్పించింది.