Devara: దసరాకు కొత్త ‘దేవర’ రాబోతున్నాడా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. హిట్ టాక్‌తో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ సత్తా ఏమిటో చూపిస్తోంది.

అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన ‘దావూదీ’ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల్ స్టెప్పులు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. కానీ, సినిమాలో ఈ పాట ఎక్కడా కనిపించకపోవడం.. కనీసం ఎండ్ టైటిల్స్‌లో కూడా కనిపించలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతేగాక, హీరోయిన్ జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువగా ఉండటంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు దేవర టీమ్, దసరా నుండి ‘దేవర’ చిత్రంలో వీటికి సంబంధించి పలు సీన్స్‌తో పాటు సాంగ్‌ని కూడా యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో దసరా నుంచి దేవర యాడెడ్ వెర్షన్‌తో థియేటర్లలో సందడి చేయనుందని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారు దసరా నుండి సరికొత్త ‘దేవర’ను చూడబోతున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version