అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ షెడ్యూల్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఏకధాటిగా 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో అఖిల్ తో పాటు అజయ్ ఘోష్ మిగిలిన ప్రధాన తారాగణం అంతా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ముగిశాక, అఖిల్ పై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందట. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాను ‘లెనిన్’ అనే టైటిల్‌తో రూపొంచబోతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version