SSMB29 మూవీపై కొత్త బజ్.. ఏమిటంటే?

SSMB29 మూవీపై కొత్త బజ్.. ఏమిటంటే?

Published on Apr 4, 2025 3:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది.

కాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను తొలుత రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని.. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాను కేవలం ఒకే భాగంగా తీయాలని.. రెండో భాగం కోసం కథను సాగదీయడం సరైన విషయం కాదని ఆయన భావిస్తున్నాడట.

సీక్వెల్ పేరుతో కథలను సాగదీయడం అన్ని ఇండస్ట్రీల్లో అలవాటైందని.. అందుకే తాను ఈ సినిమాను ఒకే భాగంగా తీయబోతున్నట్లు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు రాజమౌళి ఎలాంటి కథను తీసుకుంటున్నాడా.. ఎలా తన కథను ఒకే భాగంగా ప్రెజెంట్ చేయబోతున్నాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు