ప్రభాస్ ‘సలార్’లో కొత్త మార్పులు !

ప్రభాస్ ‘సలార్’లో కొత్త మార్పులు !

Published on Jul 24, 2021 8:58 PM IST


యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ “సలార్”లో చిన్న మార్పులు చేశారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక గాసిప్ గా వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిన్న ప్లాష్ బ్యాక్ యాడ్ చేశారట. ఈ ప్లాష్ బ్యాక్ లో ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ కనిపిస్తాడని.. ఈ ప్లాష్ బ్యాక్ మొత్తం చిత్రానికే హైలైట్‌ గా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా 2021 లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు