టాక్..”గాడ్ ఫాథర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్..?

Published on Sep 22, 2022 10:04 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో భారీ బజ్ సొంతం చేసుకున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గాడ్ ఫాథర్”. దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లు నటించిన ఈ సాలిడ్ మల్టీ స్టారర్ పై తెలుగు సహా హిందీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు మంచి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మేకర్స్ ఈ సినిమా రిలీజ్ కి మొత్తం సిద్ధం చేసేసారు.

నిన్న వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా మంచి చార్ట్ బస్టర్ కాగా ఇక సినిమా ప్రీ రిలీజ్ కోసం అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఈవెంట్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. ఈ చిత్రంపై ముందు ఈ సెప్టెంబర్ 25 డేట్ వినిపించగా ఇపుడు అయితే ఇది మారినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ని మేకర్స్ అయితే ఈ సెప్టెంబర్ 28న ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :