ఆ పేజీలలో సుశాంత్ ఏమి రాసి ఉంటాడు.

Published on Aug 7, 2020 8:17 pm IST


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ముంబై పోలీసుల విచారణపై నమ్మకం లేని బీహార్ ప్రభుత్వం కేసుల సీబీఐ కి అప్పగించాలని కేంద్రాన్ని కోరగా అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితో సీబీఐ అధికారులు కేసు విషయంలో దూకుడు పెంచారు. అలాగే ఈ ఘటనలో ఏ1 నిందితురాలిగా రియా చక్రవర్తిని ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఇక రియా కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఏడుగురిని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. అలాగే రియా చక్రవర్తి కొన్ని ఆర్ధిక నేరాలకు పాల్పడిందని ఈడీ భావిస్తుంది.

కాగా సుశాంత్ రాజ్ పుత్ డైరీలోని కొన్ని పేజీలు మిస్ కావడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. పలువురు ఆరోపిస్తున్నట్లు ఇందులో కుట్ర కోణం ఉండనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజూవారి తన చర్యలను డైరీలో రాసుకొనే అలవాటున్న సుశాంత్ మిస్సైన పేజీలలో ఏమి రాశాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో అసలు నిజాలు బయటికి వస్తాయని, ఎవరైనా డైరీ లోని ఆ పేజీలను చించేశారా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More