ఈ స్పెషల్ డే న విడుదలైన “కల్యాణమస్తు” ఫస్ట్ లుక్.!

Published on Aug 15, 2020 8:14 pm IST

నూతన నటీనటులు శేఖర్ వర్మ హీరోగా వైభవి రావ్ మరియు కీర్తిలు హీరోయిన్స్ గా కృష్ణకాంత్ క్రియేషన్స్ పతాకంపై అలేరి సుధాకర్ రెడ్డి సమర్పణలో వల్లూరుపల్లి నాగజ్యోతి నిర్మిస్తోన్న చిత్రం “కళ్యాణమస్తు”. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు.అలాగే మూవీ టీజర్ ను ఆగస్ట్ 22.న ఉదయం 9:22 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. మంచి కథ .కథనం తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓ. శశి దర్శకత్వం వహిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో శేఖర్ వర్మ ..తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను మెప్పించి.. మరో మెట్టు ఎక్కడం ఖాయమని తెలిపారు..అందమైన లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత తెలియజెశారు..అలాగే ఈ మూవీలో బాహుబలి కాలకేయ రోల్ చేసిన ప్రభాకర్ ఒక ప్రత్యేక పాత్ర లో నటిస్తున్నారని తెలిపారు.కెమెరామెన్: మల్లికార్జున్ నరగాని అందించగా, సంగీతం: రఘు రామ్ అందించారు. వి.ఎన్.వి.సురేష్ ఎడిటింగ్ అందించారు.

సంబంధిత సమాచారం :

More